NGT: చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన ఎన్జీటీ
చెట్ల తగ్గుదల దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, తమ ప్రాంతాల్లో హరిత హరణం, అడవుల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 57,57,555 ఎకరాల (2.33 మిలియన్ హెక్టార్లు) ప్రాంతంలో చెట్లు తగ్గాయని, దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
అయిదేళ్ల విరామంతో భారత్‌లో అడవుల పరిస్థితులపై నివేదిక
నవంబర్ 18న జారీ అయిన ఈ ఆదేశాల ప్రకారం, జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ సుధీర్ అగర్వాల్ మరియు ఎక్స్‌పర్ట్ మెంబర్ అఫ్రోజ్ అహ్మద్‌ల ధర్మాసనం సర్వే ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది వాదనలు వినిపించుకున్నారు. ఈ సందర్భంగా , ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అటవీ విస్తీర్ణ సమాచారం గురించి తెలియజేశారు. 2000 నుంచి 2024 మార్చి వరకు, ప్రతి అయిదేళ్ల విరామంతో భారత్‌లో అడవుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని, డెహ్రాడూన్ డైరెక్టర్ జనరల్ ద్వారా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశిస్తూ ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ కేసులో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ట్రైబ్యునల్ పక్షంగా, ప్రతివాదులుగా చేర్చబడ్డాయి.