Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.
షాహ్ పూర్‌లోని హర్దయాళ్ బాబా ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదంజరిగింది.
ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
గాయపడిన వారిని బయటికి తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Details
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
షాపూర్ లో ని హర్దౌల్ బాబా టెంపులో ఓ కార్యక్రమం జరుగుతుండగా ఉన్నట్టుండి ఈ గోడ కూలింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని పోలీసులు వెల్లడించారు.
చనిపోయిన పిల్లలంతా 10-15 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు.