LOADING...
Nitish Kumar: బీహార్‌లో కొలువుదీరిన ప్రభుత్వం.. పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం

Nitish Kumar: బీహార్‌లో కొలువుదీరిన ప్రభుత్వం.. పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జేడీయూ నాయకుడు నితీష్ కుమార్‌ (Nitish Kumar) ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌... నితీశ్‌ కుమార్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంతో నితీశ్‌ కుమార్‌ ఒక విశేష రికార్డును అందుకున్నారు. బీహార్‌లో 10వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా ఆయన కొత్త చరిత్ర సృష్టించారు. అదే వేదికపై సామ్రాట్‌ చౌదరి (Samrat Choudhary), విజయ్‌ కుమార్‌ సిన్హా (Vijay Kumar Sinha) ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

వివరాలు 

202 సీట్లు గెలిచిన  ఎన్డీయే 

ఈ ప్రమాణ స్వీకారజేపీ నడ్డా సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వంటి పలువురు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఇటీవల ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 243 స్థానాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 202 సీట్లను ఎన్డీయే గెలుచుకుంది. అందులో బీజేపీకి 89, జేడీ(యూ)కు 85, కూటమి భాగస్వాములైన ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌)కి 19, హెచ్‌ఏఎం‌కు 5, ఆర్‌ఎల్‌ఎస్‌పీకి 4 స్థానాలు లభించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం