kasibugga stampede: పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.. కాశీబుగ్గ విషాదంపై ఆలయ అధికారి స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రోజూ రెండు వేల వరకు భక్తులు మాత్రమే వస్తారని, అయితే ఈసారి ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని తెలిపారు. 'భక్తులకు ప్రసాదం ఇచ్చి పంపించడం మా పద్ధతి. కానీ ఇంత పెద్ద ఎత్తున రద్దీ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని హరిముకుంద్ పండా వివరించారు. ఘటన అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆలయానికి వెళ్లి హరిముకుంద్ పండాతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ తర్వాత వారు బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు.
Details
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హరిముకుంద్ పండా కూడా ఆలయ ఆవరణలోనే ఉన్నారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏకాదశి సందర్భంగా వేలాది భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.