Loading...
Revanth Reddy: ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్‌ ఫ్రం లేక్స్‌: సీఎం
ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్‌ ఫ్రం లేక్స్‌: సీఎం

Revanth Reddy: ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్‌ ఫ్రం లేక్స్‌: సీఎం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బదులుగా వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్నటి వరకు శిల్పారామం గురించి మాట్లాడుకున్న నగరవాసులు.. ఇకపై తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆధునికీకరించిన తమ్మిడికుంట చెరువును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమందికి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో ఆక్రమణల కారణంగా 14 ఎకరాలకు పరిమితమైన తమ్మిడికుంటను ఇప్పుడు 30 ఎకరాల విస్తీర్ణానికి పెంచినట్లు వెల్లడించారు.

వివరాలు 

చెరువుల ఆక్రమణలతోనే కాలనీలు జలమయం

హైదరాబాద్‌ను ఒకప్పుడు రాక్స్ అండ్ లేక్స్ సిటీగా పిలిచేవారని సీఎం గుర్తుచేశారు.

గతంలో నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో పాటు ఆక్రమణల వల్ల వాటిలో దాదాపు 50 శాతం కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువులు కబ్జాలకు గురికావడం వల్లే కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లపైకి నీరు చేరుతోందని, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని చెప్పారు.

ఈ పరిస్థితిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.

సుమారు వందేళ్ల క్రితమే మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడేందుకు నిజాం పాలకులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారని గుర్తుచేశారు.

ముచుకుందా నది.. మూసా, ఈసా నదుల సంగమంతో మూసీగా మారి, నదీ నాగరికతకు కేంద్రంగా నిలిచిందని వివరించారు.

వివరాలు 

మూసీ ప్రక్షాళన ఆగదు.. బాధితులకు అండగా ఉంటాం

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూసీ నది తీవ్రంగా కలుషితమైందని రేవంత్ రెడ్డి అన్నారు.

కలుషిత నీటి ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మూసీకి కేవలం బయటికి కనిపించే సుందరీకరణ చేయడం తమ ఉద్దేశం కాదని, నదికి పూర్తిస్థాయిలో పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ పనుల వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా, ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

త్వరలోనే మూసీ పునరుజ్జీవన పనుల్లో తొలి దశను ప్రారంభిస్తామని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

'లేక్ ఎకానమీ' అభివృద్ధికి ప్రాధాన్యం

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని, హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి కలిసి రావాలని పిలుపునిచ్చారు.

నగరంలోని చెరువులను పరిరక్షించడంతో పాటు వాటి చుట్టూ 'లేక్ ఎకానమీ'ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

తమ్మిడికుంట ప్రాంగణానికి వచ్చే ప్రజలకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

'లేక్ ఎకానమీ' అభివృద్ధికి ప్రాధాన్యం

చెరువు ఆవరణలో ఒక జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు.

దసరా వంటి సంప్రదాయ వేడుకలకు చెరువులు వేదికలుగా మారితే ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా కాపాడుకునే అవకాశం ఉంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

చెరువుల పరిరక్షణతో పాటు వాటిని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమ్మిడికుంట చెరువు ప్రారంభం 

ADVERTISEMENT