LOADING...
APSRTC: ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్‌ 
ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్

APSRTC: ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ కోసం ఇంకా బస్టాండ్‌లు, నెట్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మనమిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవల ద్వారా ఆర్టీసీ టికెట్లను సులభంగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్‌ను ఆశ్రయించకుండానే, టికెట్‌ను నేరుగా వాట్సాప్‌లోనే పొందవచ్చు.

Details

టికెట్‌ బుకింగ్‌ ఇలా చేయాలి 

ముందుగా ప్రభుత్వం అందించిన 95523 00009 నంబరును మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కు 'హాయ్‌' అని సందేశం పంపితే వివిధ సేవల జాబితా కనిపిస్తుంది. అందులో ఆర్టీసీ సేవలు ఎంపిక చేస్తే టికెట్‌ బుకింగ్‌ ఆప్షన్‌ వస్తుంది. అక్కడ ప్రయాణానికి సంబంధించిన వివరాలు బయలుదేరే ప్రదేశం, చేరాల్సిన గమ్యం, ప్రయాణ తేదీ తదితర సమాచారాన్ని నమోదు చేయాలి. అనంతరం అందుబాటులో ఉన్న బస్సులు, వాటి సమయాల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అవసరమైన బస్సును ఎంపిక చేసుకుని, ఖాళీగా ఉన్న సీటును బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తిచేసిన వెంటనే టికెట్‌ నిర్ధారణ సందేశం నేరుగా మీ వాట్సాప్‌కే అందుతుంది.

Advertisement