Rammohan Naidu: ఏటీఎఫ్‌లో ఇథనాల్ ప్రతిపాదనే లేదు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. విమాన భద్రతకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల ప్రయాణికుల్లో అనవసరమైన భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానాల ఇంధనంలో ఇథనాల్.. కొట్టిపారేసిన రామ్మోహన్ నాయుడు
The claim that the Government plans to blend ethanol with Aviation Turbine Fuel (ATF) is completely false and irresponsible. There is no such proposal.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) August 6, 2026
Ethanol and Sustainable Aviation Fuel (SAF) are entirely different and should not be conflated. SAF is an internationally…
వివరాలు
ఎస్‌ఏఎఫ్‌కు ICAO గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోందని, దీంతో విమాన భద్రతపై ప్రభావం పడొచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం ఎక్స్‌లో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
దీనిపై స్పందించిన రామ్మోహన్ నాయుడు, ఇథనాల్,సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) రెండూ పూర్తిగా భిన్నమైన ఇంధనాలని స్పష్టం చేశారు.
ఎస్‌ఏఎఫ్‌కు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) గుర్తింపు ఉందని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న కఠిన భద్రతా ప్రమాణాలు, సాంకేతిక పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే ఈ ఇంధనాన్ని విమానాల్లో వినియోగిస్తున్నారని వివరించారు.
ఏటీఎఫ్‌లో ఇథనాల్ కలపాలన్న ప్రచారానికి ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.