LOADING...
Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడాలో కార్మికులు ఆందోళనకు దిగారు. తమ హక్కుల కోసం రోడ్డెక్కడం సహజమే అయినా, నిరసనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోమవారం ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా అదుపు తప్పి, ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు దారితీశాయి. పోలీసులు చేరుకునేలోపే గణనీయమైన నష్టం సంభవించడంతో అధికార యంత్రాంగం ఆందోళనకు గురైంది. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆందోళనల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేపట్టగా కీలక అంశాలు బయటపడ్డాయి. కార్మికుల నిరసనల్లోకి బయటి వ్యక్తులు చొరబడ్డారని పోలీసులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఘటనల వెనుక విదేశీ ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

మూడు వందల మంది అరెస్ట్

ముఖ్యంగా పాకిస్థాన్ సంబంధం ఉన్నట్లు కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ ఆరోపించారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మూడు వందల మందిని అరెస్ట్ చేయగా, మరో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీలు, రహదారులపై ఉన్న నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, బయటి వ్యక్తులు ఎలా ప్రవేశించారన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు.

వివరాలు 

ఇరవై ఒక శాతం వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ప్రకటన

ఇదిలా ఉండగా, కార్మికులకు ఉపశమనం కలిగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కార్మికుల వేతనాలను ఇరవై ఒక శాతం పెంచుతూ ప్రకటన చేసింది. అయినప్పటికీ, ఈ నిర్ణయం వచ్చిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి.

Advertisement