Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది. నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లో కుక్కను తీసుకెళ్లడంపై ఓ మహిళ.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్‌పీ గుప్తా మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో మహిళపై.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేయి చేసుకున్నాడు. ఆమె చెంపపై ఆర్‌పీ గుప్తా కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కను మహిళ లిఫ్ట్‌లో తీసుకెళ్తుండగా, ఆర్‌పీ గుప్తా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ వివాదం పోలీసుల వద్దకు చేరింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.