Page Loader
AP Rains: ఏపీలో నాన్‌స్టాప్ వానలు.. మరో మూడు రోజులు వానల మోత
ఏపీలో నాన్‌స్టాప్ వానలు.. మరో మూడు రోజులు వానల మోత

AP Rains: ఏపీలో నాన్‌స్టాప్ వానలు.. మరో మూడు రోజులు వానల మోత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య అరేబియా సముద్రం నుంచి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా వరకు సముద్రమట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది. దీని కారణంగా దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే వచ్చే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Details

తెలంగాణలో కొన్ని జిల్లాలో వర్షాలు పడే అవకాశం

ఇక అరేబియా సముద్రం నుంచి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతుండగా, మరో ద్రోణి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టం నుండి 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది.

Details

40 కిలోమీటర్ల వేగంతో గాలులే వీచే అవకాశం

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో గాలులు వీయవచ్చునని హెచ్చరించింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు అనుకూల వాతావరణం కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మేఘాలు కమ్మిన సమయంలో మేఘగర్జనలు, మెరుపులు వచ్చినపుడు చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.