LOADING...
Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ 
వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ

Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. తొలివిడతగా 104 మంది భారతీయులు సీ-17 విమానంలో బుధవారం అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అయితే, భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి పంపించారనే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీయగా, కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. వైరల్ ఫొటోల్లో ఉన్న వారు భారతీయులు కారని స్పష్టంగా వెల్లడించింది.