Page Loader
Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 
Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు సీఈసీ ఈ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. నేటి నుంచి అంటే.. 11వ తేదీ నుంచి ఈనెల 18వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న ఉపసంహరణ, 29న పోలింగ్ ఉండనుంది. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వెంటనే సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారి రాజీనామాతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోటిఫికేషన్ జారీ