
Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది. ఇందుకోసం ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో 50 చదరపు గజాల భూమిలో ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు భారీ ఉపశమనం కల్పించింది. ఇప్పటి వరకు ఈ విభాగాల్లో చెల్లించవలసిన అన్ని రకాల ఫీజులను పూర్తిగా మినహాయించింది. ఇకపై 50 గజాల్లో రెండు అంతస్తుల లోపు(జీ ప్లస్-1)ఇళ్లు కట్టుకునే వారు అనుమతుల కోసం కేవలం రూ.1 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఇటువంటి రెండు అంతస్తుల నిర్మాణాలకు రూ.5 వేల వరకు ఫీజులు ఉండేవి. అంతేకాక, అధికారుల అనధికార వసూళ్లకు కూడా ఆ అవకాశంలేకుండా చేసింది. ఈ చర్యతో పేద కుటుంబాలకు ఆర్థికంగా గణనీయమైన ఊరట లభించింది.
Details
జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల పరిస్థితి ఇదే
అధికారులు ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణం 50 చదరపు గజాల్లో మాత్రమే ఉండాలి గరిష్టంగా రెండు అంతస్తులు (G+1) వరకే అనుమతి 100 గజాల స్థలం ఉన్న వారు దాన్ని 50 గజాలకు తగ్గించుకుని నిర్మాణం చేయరాదు ప్రభుత్వ భూములు లేదా వివాదాస్పద స్థలాల్లో అనుమతి లేదు ఇంటి ముందుభాగంలో వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయకూడదు మార్కాపురం పురపాలక సంఘం ప్రణాళిక విభాగ అధికారి శ్రీనివాసరావు ఈ వివరాలను తెలిపారు.
Details
425 ఇళ్ల నిర్మాణ పనులకు దరఖాస్తులు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 425 ఇళ్ల నిర్మాణ దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: మార్కాపురం - 40 పొదిలి - 34 చీమకుర్తి - 33 దర్శి - 57 గిద్దలూరు - 35 కనిగిరి - 6 ఒంగోలు నగర పాలక సంస్థ - 161 ఒనుడా పరిధి - 59 ప్రభుత్వ నిర్ణయం ద్వారా పేదలకు చట్టబద్ధ అనుమతులు సులభతరం కావడం మాత్రమే కాకుండా ఆర్థిక భారం కూడా దూరమైంది.