Cyclone Warning: తుపాను ముందు పోర్టుల్లో నంబర్ వారీగా అలర్ట్.. దాని అర్థం ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాను వేగంగా ఆంధ్ర తీరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీవ్రత, దూరం ఆధారంగా ఈ హెచ్చరికలను 1 నుంచి 11 నంబర్లలో జారీ చేస్తారు. అసలు ఈ నంబర్ల అర్థమేమిటి? ఎప్పుడు వాటిని ప్రకటిస్తారో చూద్దాం. 1-2 నంబర్ హెచ్చరికలు తుపాను ఓడరేవు నుండి 400 నుంచి 750 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఇవి జారీ చేస్తారు. వెంటనే ప్రభావం ఉండకపోయినా, ముందస్తు జాగ్రత్త సూచనగా ఈ హెచ్చరికలు ప్రకటిస్తారు.
Details
3-4 నంబర్ హెచ్చరికలు
తుపాను 150 నుంచి 400 నాటికల్ మైళ్ల పరిధిలోకి చేరినప్పుడు ఈ నంబర్ల హెచ్చరికలు జారీ అవుతాయి. ఇవి తుపాను పోర్ట్ దిశగా కదులుతోందని, ప్రభావం పడే అవకాశం ఉందని సూచిస్తాయి. 5-6 నంబర్ హెచ్చరికలు తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5వ, 6వ నంబర్ల సూచికలు వెలువడతాయి. ఈ దశలో గాలులు, అలలు ఓడరేవు పరిసరాల్లో ప్రభావం చూపుతాయి. ఈ హెచ్చరికలతోపాటు పోర్టులోని అన్ని కార్యకలాపాలు తక్షణమే నిలిపివేయాలి.
Details
8-10 నంబర్ హెచ్చరికలు
తుపాను 50 నాటికల్ మైళ్ల లోపలికి చేరుకున్నప్పుడు ఇవి జారీ అవుతాయి. ఇవే అత్యంత ప్రమాదకర హెచ్చరికలుగా పరిగణించబడతాయి. తుపాను నేరుగా పోర్టు లేదా సమీప తీరప్రాంతంపై దాడి చేస్తుందన్న సూచన. ఈసమయంలో గాలుల వేగం గంటకు 80 నుంచి 200 కి.మీ. వరకు ఉంటుంది. వెంటనే నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 11 నంబర్ హెచ్చరిక ఈ సూచిక వెలువడితే, తుపాను ఇప్పటికే పోర్టు సమీపంలో ఉందన్న అర్థం. తీవ్ర గాలులు, వర్షాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి, స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరి. తుపానుల సమయంలో కేంద్ర ప్రభుత్వం, భారత వాతావరణ విభాగం జారీ చేసే సూచనలను అనుసరించి పోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారి ధర్మశస్త్ర తెలిపారు.