LOADING...
Zohran Mamdani: దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

Zohran Mamdani: దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

జైలులో ఎన్నేళ్లుగా నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు ఊహించని చోటు నుంచి మద్దతు లభించింది. ఆయనకు సంఘీభావంగా భారత మూలాలు కలిగిన న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఒక లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నగరానికి తొలి ఆసియా అమెరికన్, ముస్లిం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ, 2025 డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసి ఈ లేఖను స్వయంగా అందజేశారు. మమ్దానీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే (గురువారం) ఉమర్ ఖలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి ఈ లేఖకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు. లేఖలో మమ్దానీ భావోద్వేగంగా స్పందించారు.

వివరాలు 

అమెరికాలో నివసిస్తున్న మరో కుమార్తెను కలిసేందుకు ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులు

"ప్రియమైన ఉమర్,చేదు అనుభవాలు మన జీవితాలను పూర్తిగా కబళించకుండా ఉండేలా చూసుకోవడం ఎంత అవసరమో నీవు చెప్పిన మాటలు నాకు తరచూ గుర్తొస్తుంటాయి. నీ తల్లిదండ్రులను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మేమందరం నీ గురించే ఆలోచిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులు సహిబా ఖానమ్, సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇలియాస్ తమ చిన్న కుమార్తె వివాహానికి ముందుగా అమెరికాలో నివసిస్తున్న మరో కుమార్తెను కలిసేందుకు వెళ్లారని లాహిరి తెలిపారు.

వివరాలు 

ఉమర్ ఖలీద్‌కు డిసెంబర్‌లో మధ్యంతర బెయిల్

ఆ ప్రయాణంలోనే వారు మేయర్ మమ్దానీని కలిసి కొంతసేపు ఆయనతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, యూఏపీఏ చట్టం కింద 2020 నుంచి జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు తన సోదరి వివాహం సందర్భంగా డిసెంబర్‌లో మధ్యంతర బెయిల్ మంజూరైంది. బెయిల్ షరతుల ప్రకారం ఆయన ఇంటికే పరిమితమైనప్పటికీ, కొద్ది రోజులు కుటుంబ సభ్యులతో గడపగలగడం ఉమర్ ఖలీద్‌కు మానసికంగా కొంత ఊరటనిచ్చిందని సమాచారం.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ నుంచి లేఖ

Advertisement