Loading...
Octave, VIT-A: అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం
అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం

Octave, VIT-A: అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆక్టేవ్ సంస్థ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML), సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించేందుకు ఈ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆక్టేవ్‌కు చెందిన మెంటర్ల మార్గదర్శకత్వంలో వీఐటీ-ఏపీ విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఒక్కో ప్రాజెక్టులో ఒక ప్రొఫెసర్, నలుగురు విద్యార్థులు, ఇద్దరు మెంటర్లు భాగస్వాములుగా ఉంటారు. ప్రతి ప్రాజెక్టును మూడు నెలల వ్యవధిలో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా విద్యార్థులకు అకడమిక్‌ పరిజ్ఞానంతో పాటు వాస్తవ పరిశ్రమ అవసరాలపై అనుభవం లభించనుంది.

వివరాలు 

పాఠ్యాంశాల రూపకల్పనలోనూ సహకారం

AI, MLకు సంబంధించిన పాఠ్యాంశాలను మరింత పరిశ్రమకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వీఐటీ-ఏపీకి ఆక్టేవ్ తన సూచనలు, మార్గదర్శకాలను అందించనుంది.

ప్రస్తుత సాంకేతిక రంగంలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పొందేలా పాఠ్యాంశాలను మెరుగుపరిచేందుకు ఈ సహకారం ఉపయోగపడనుంది.

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి హ్యాకథాన్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ అవకాశాలను కూడా ఇరు సంస్థలు సంయుక్తంగా కల్పించనున్నాయి.

ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, మెంటర్ల మార్గదర్శకత్వంతో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి విద్యార్థులకు అవకాశం లభించనుంది.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే ఈ అవగాహన ఒప్పందం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

AI, ML, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు అందించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT