
Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రూ.8 లక్షల బీమా పరిహారం కోసం భార్యను, కూతురును కర్కశంగా పాముతో కాటేసి చంపేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
45 రోజుల క్రితం జరిగిన ఈవిషాద ఘటనలో గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాం జిల్లాలోని అధెగావ్'లో గణేష్ పాత్ర,భార్య బసంతి,కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు.మూడేళ్ల క్రితం ఈ జంటకు వివాహం జరిగింది. కుమార్తె పేరు దేబాస్మిత.
కుటుంబాన్నిఅంతం చేసేందుకు అక్టోబర్ 6న ఓ ప్లాస్టిక్ జార్ లో ఓ భయంకర పామును పట్టుకొచ్చి భార్యా పిల్లలు నిద్రిస్తున్న గదిలో విడిచి తాను మాత్రం మరో గదిలో నిద్రించాడు.
details
ఏమీ తెలియనట్లు దొంగ ఏడ్పులు ఏడ్చాడు, చివరకు కటకటాల పాలయ్యాడు
దీంతో ఆ విషసర్పం తన భార్యా, బిడ్డల్ని కాటు వేసింది. తెల్లారేసరికి ఇద్దరూ ప్రాణం విడిచారు. మరునాడు గణేశ్ ఏమీ తెలియనట్లుగా భార్యా బిడ్డలు పాము కరిచి చనిపోయారని దొంగ ఏడ్పులు ఏడ్చి అందరినీ నమ్మించాడు. చివరకు పోలీసులనూ అదే మాటతో నమ్మబలికాడు.
అయితే బసంతి తండ్రి తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే గణేశ్'ను అదుపులోకి తీసుకున్నారు. తానే ఆ పామును తీసుకొచ్చి వారి గదిలో వేశానని విచారణలో అంగీకరించాడు.
నెలన్నర తర్వాత నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశామని గంజాం జిల్లా ఎస్పీ జగ్మోమన్ మీనా తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భార్యా బిడ్డలను దారుణంగా క్రూరంగా చంపిన ప్రభుద్ధుడు
Odisha: Man kills wife and 2-year-old daughter using a cobra for Rs 8 lakh ‘snakebite’ compensation, arrestedhttps://t.co/m6X9aK5Thu
— OpIndia.com (@OpIndia_com) November 24, 2023