Page Loader
Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 
Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు

Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 

వ్రాసిన వారు Stalin
Dec 26, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది. కాలీఫ్లవర్ (Cauliflower) దొంగిలించిందని తన తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు ఓ కొడుకు. దీంతో పోలీసులు 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని సరస్పసి గ్రామానికి చెందిన శతృఘ్న మహంత్‌గా గుర్తించారు. వృద్ధురాలు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిందని కొంతమంది గ్రామస్తులు తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. తమ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారన్నారు.

ఒడిశా

వృద్ధురాలిని కొట్టిన వీడియో వైరల్

మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పెద్ద కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆ వృద్ధురాలు తన చిన్న కొడుకుతో జీవిస్తోంది. ప్రభుత్వ రేషన్, ఇతర గ్రామస్తుల దయపై ఆధారపడిన ఆ మహిళ జీవనోపాధికి మరో మార్గం లేదు. బాధితురాలికి డబ్బు అవసరం కావడంతో తన కుమారుడి పొలంలోని కాలీఫ్లవర్‌ను పొరుగువారికి విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కొడుకు తన 60 ఏళ్ల మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన డిసెంబర్ 20వ తేదీన జరిగింది. కొడుకు తన తల్లిని స్తంభానికి కొట్టేసి కొట్టిన వీడియా వైరల్‌గా మారింది.