LOADING...
Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల
సముద్రంలోకి పిల్లల విడదల

Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. బియ్యపుతిప్ప నుంచి పేరుపాలెం సౌత్‌ వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున తీరప్రాంతంలో ఈ తాబేళ్లు గుడ్లు పెట్టాయి. ఈ గుడ్లను అటవీశాఖ అధికారులు రెండు నెలల క్రితం సేకరించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు హేచరీల్లో భద్రంగా సంరక్షించారు. ఇటీవల ఆ గుడ్ల నుంచి పిల్ల తాబేళ్లు వెలువడటం ప్రారంభమైంది. దీంతో అటవీశాఖ సిబ్బంది విడతలవారీగా ఆ చిన్న తాబేళ్లను సముద్రంలోకి వదులుతున్నారు. పెదమైనవానిలంక సమీపంలోని సాగరతీరంలో ఈ అందమైన దృశ్యాలు కనిపించాయి.

Advertisement