Page Loader
Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం
అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం

Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అక్టోబరు 17న పంచకులలోని దసరా గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారం చేయనుంది. ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీతో పాటు, ఇతర మంత్రివర్గం ఆరోజున ప్రమాణం స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఆయనతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ధ్రువీకరించారు.

Details

ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం ప్రారంభం

రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొత్త మంత్రివర్గ సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక కమిటీని డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ యశ్‌గార్గ్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ అంచనాలను మించి విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు విరుద్ధంగా, బీజేపీ 40 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.