సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి. 19న, వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమైన విషయం తెలిసిందే. వినాయ చవితి సందర్భంగా కార్యకలాపాలు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ప్రత్యేక సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే జరుగుతాయని ఉభయ సభల సెక్రటేరియట్‌లు ఇప్పటికే తెలిపాయి. జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి సెషన్ కావొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.