తదుపరి వార్తా కథనం

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై 21వ తేదీకి వాయిదా
వ్రాసిన వారు
Stalin
Sep 19, 2023
01:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విచారణకు స్వీకరించింది.
విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది జస్టిస్ హరీశ్ సాల్వే వాదించారు. అయితే విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదిస్తున్నారు.
ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ప్రారంభించింది.
దీనిపై ఇప్పటికే సీఐడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన చంద్రబాబు నాయుడు
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2023
పిటిషన్ ఎల్లుండి సెప్టెంబర్ 21కి వాయిదా pic.twitter.com/FQE1P3Jdsp