Jagdeep Dhankhar: రాజ్యసభ ఛైర్మన్,ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇండియా కూటమి
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ఇండియా కూటమి నేతలు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రక్రియ కోసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, 70 మంది ఎంపీలు ఇప్పటికే సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ నాయకురాలు రణజీత్ రంజన్ పేర్కొన్నారు.
వివరాలు
ఇరు సభలు రేపటికి వాయిదా
ఈ నేపథ్యంలో పార్లమెంటులో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.
సభా గౌరవం కాపాడటంలో ప్రతిసభ్యుడు కృషి చేయాలని పేర్కొన్న ఆయన, ఇటీవల కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.