Loading...
Rahul Gandhi: 'జ్ఞానేశ్.. ఇక చాలు'.. బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా పట్టుకున్న రాహుల్
'జ్ఞానేశ్.. ఇక చాలు'.. బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా పట్టుకున్న రాహుల్

Rahul Gandhi: 'జ్ఞానేశ్.. ఇక చాలు'.. బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా పట్టుకున్న రాహుల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు దిల్లీలో నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం 'నిర్వాచన్ సదన్' వైపు ఎంపీలు, నేతలు ర్యాలీగా బయలుదేరారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ 'Save Democracy' బ్యానర్లను ప్రదర్శించారు. ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో పార్లమెంట్‌, ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో, ఆకాశవాణి భవన్ వైపు వెళ్లే మార్గంలో ఎంపీలను భద్రతా సిబ్బంది నిలువరించారు.

వివరాలు 

బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్

పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం రాహుల్ గాంధీ పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్‌పైకి ఎక్కి చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

దీంతో రాహుల్‌, ప్రియాంకా గాంధీ సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

'జ్ఞానేశ్.. ఇక చాలు' అంటూ రాహుల్

ఈ నిరసనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ''జ్ఞానేశ్.. ఇక చాలు. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది'' అంటూ ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఈ ఆందోళన చేపట్టింది.

అయితే ఈ నిరసనలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు పాల్గొనలేదు. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈ ఆందోళనకు దూరంగా ఉన్నాయి.

ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో దిల్లీలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. The Wire

ADVERTISEMENT