LOADING...
PM Modi: ప్రతిపక్షం నిరాశ నుండి బయటపడి తన బాధ్యతను నెరవేర్చాలి: పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ
పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ

PM Modi: ప్రతిపక్షం నిరాశ నుండి బయటపడి తన బాధ్యతను నెరవేర్చాలి: పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ"వికసిత్ భారత్" దిశగా దేశం ముందుకు సాగుతోంది అని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజున లోకసభకు హాజరై మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి అభిప్రాయాన్ని గౌరవించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టసభల్లో సమయానికి చర్చలు జరుగటం తప్పనిసరి అని గుర్తు చేశారు. దేశాభివృద్ధి కోసం,పార్లమెంట్‌లో అధికార పార్టీ,విపక్ష సభ్యుల మధ్య సార్ధకమైన చర్చలు కొనసాగాలని ప్రధాని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం దేశాన్ని ముందుకు నడిపించడంనే అని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. దేశాభివృద్ధికి విపక్ష పార్టీలూ తోడుగా రావాలని పిలుపునిచ్చారు. అలాగే, బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో రికార్డ్ ఓటింగ్ నమోదవడంతో, ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం పెరిగినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ

Advertisement