
Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.
"భార్యే ఓ షూటర్‌ను నియమించి తన భర్తను హత్య చేయించింది"అంటూ జబల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఒసాఫ్ ఖాన్ సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.
బాధతో ఉన్న ఆమెపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
ఒసాఫ్ చేసిన ఈహేయమైన కామెంట్‌పై ప్రజలు తీవ్రంగా స్పందించారు.వైద్యవృత్తికి చెందిన వ్యక్తి ఒసాఫ్ ఖాన్‌పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని అతన్నిఅరెస్ట్ చేశారు.జబల్‌పూర్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం ఫోటో
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మంగళవారం రోజు నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన అతని భార్య హిమాన్ష్ శోకంలో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ఒసాఫ్ ఖాన్ ఆ ఫోటోపై స్పందిస్తూ అసభ్యంగా వ్యాఖ్యానించాడు.
"ఇది ఆమె పథకమే కావచ్చు, ఆమెనే షూటర్‌ను పెట్టి హత్య చేయించిందేమో" అంటూ దుర్మార్గంగా పేర్కొన్నాడు.
"ఆమెపై తప్పకుండా విచారణ జరగాలి. అవకాశం లభించిన వేళ చంపేసి ఉండొచ్చని" అంటూ నీచంగా వ్యాఖ్యానించాడు.
ఈ మాటలు స్థానికులకు భరించరానివిగా మారాయి. అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి ఈ విషయంలో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒసాఫ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
వివరాలు
ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహం
నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితం నౌకాదళంలో చేరారు. ప్రస్తుతం కొచ్చిలో నేవీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. అదే నెల 19న రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.
తర్వాత హనీమూన్ కోసం భార్యతో కలిసి పహల్గామ్ వెళ్లారు. నిజానికి విదేశీ ట్రిప్ ప్లాన్ చేసినప్పటికీ వీసా ఆలస్యం కావడంతో పహల్గామ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
హనీమూన్ సమయంలో, ఉగ్రవాదులు అకస్మాత్తుగా జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర దు:ఖం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఒక వైపు ఇలాంటి నీచ వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి.