Loading...
OU Campus Job Mela 2026: ఓయూ క్యాంపస్‌లో జాబ్ మేళా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు!
ఓయూ క్యాంపస్‌లో జాబ్ మేళా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు!

OU Campus Job Mela 2026: ఓయూ క్యాంపస్‌లో జాబ్ మేళా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు మరో మంచి అవకాశం లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఏ కంపెనీలో ఉద్యోగాలు..? ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ భద్రతా సేవల సంస్థ ఫోర్ట్ 9 సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.

వివరాలు 

ఉద్యోగ వివరాలు

. ఉద్యోగ హోదా: ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ)

. పని విభాగం: సెక్యూరిటీ సూపర్‌విజన్

. మొత్తం ఖాళీలు: 10

అర్హతలు ఇవే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 26 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35 వేల వరకు వేతనం అందించనున్నారు.

వివరాలు 

ఇంటర్వ్యూకు ఏం తీసుకెళ్లాలి..?

అభ్యర్థులు తమ బయోడేటా లేదా అప్‌డేట్ చేసిన రెస్యూమ్‌తో పాటు విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలి.

ఇంటర్వ్యూ ఎక్కడ, ఎప్పుడు..?

జూన్ 23న ఉదయం 11 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా అక్కడికి చేరుకుని ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

ప్రైవేట్ రంగంలో మంచి వేతనంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశంగా నిలవనుంది.

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాలకు కంపెనీ హెచ్ఆర్ (HR) ప్రతినిధిని 9247526978 అనే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT