Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) హిందీ మహావిద్యాలయం అనుమతులను రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలలో అక్రమాలు జరిగినట్లు ఓయూ నియమించిన విచారణ కమిటీ నివేదికలో స్పష్టమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణలో ఓ ప్రైవేటు కళాశాలలో ఓయూ అధికారుల సంతకాలు నకిలీ చేసినట్లు నిర్ధారణైంది. ఈ నేపథ్యంలో హిందీ మహావిద్యాలయం స్వయం ప్రతిపత్తి (ఆటోనమీ)ను రద్దు చేయాలని యూజీసీకి సిఫారసు చేయాలని ఓయూ నిర్ణయించింది. ప్రస్తుతం హిందీ మహావిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల కోసం ఓయూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారు తమ కోర్సులు పూర్తి చేయడానికి తగిన అవకాశాలు కల్పిస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది.