LOADING...
Telangana: ఓటు అమ్మకానికి కాదు… ప్రజాస్వామ్యానికి!
ఓటు అమ్మకానికి కాదు… ప్రజాస్వామ్యానికి!

Telangana: ఓటు అమ్మకానికి కాదు… ప్రజాస్వామ్యానికి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజ్యాంగం పారదర్శక ప్రజాస్వామ్యానికి, సమాజ మేలుకోసం అందించిన అత్యంత కీలకమైన హక్కు ఓటు. ఆ ఓటు హక్కును ప్రతి పౌరుడు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా,స్వేచ్ఛగా వినియోగించినప్పుడే దాని అసలు ఉద్దేశం నెరవేరుతుంది. అయితే,కొంతకాలంగా ఓటర్లను ప్రలోభాలతో మభ్యపెట్టి,డబ్బు కోసం ఓటును తాకట్టు పెట్టే ధోరణి పెరుగుతుండటం సామాజిక బాధ్యతకు భంగం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో స్వతంత్రంగా,మంచి నాయకులను ఎన్నుకునేందుకు తాము సిద్ధమని రామవరం ప్రాంతానికి చెందిన ఓ ఓటరు చాటి చెప్పాడు. తన ఇంటి ముందు 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు. దయచేసి గమనించండి' అనే బోర్డును ఏర్పాటు చేసి, ఓటు విలువను గుర్తు చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఇదే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement