Ayodhya: అయోధ్య రామాలయ సీఈవో పదవికి భారీ స్పందన.. 24 గంటల్లోనే 1,000 దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పదవికి భారీ స్పందన లభిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 1,000కు పైగా దరఖాస్తులు అందినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన వారిలో రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులతో పాటు మాజీ ఉన్నతాధికారులు,వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో సీఈవో ఎంపిక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. అధికారుల ప్రకారం, జులై 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
వివరాలు
సీఈవో చంపత్ రాయ్ రాజీనామా
అనంతరం జులై 19 నుంచి వాటి పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 22న జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో కొత్త సీఈవో నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి సీఈవో చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల అనంతరం కొత్త సీఈవోను నియమించేందుకు ట్రస్ట్ నియామక ప్రక్రియను ప్రారంభించింది.