
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ముష్కరుడి ఫొటో విడుదల..
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
భారత సైన్యం,సీఆర్పీఎఫ్,వాయుసేన బలగాలు కూంబింగ్ ఆపరేషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నాయి.
పహల్‌గామ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. డ్రోన్లను వినియోగిస్తూ ఆర్మీ భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
ఉగ్రదాడికి సంబంధించిన అన్ని వివరాలపై దర్యాప్తు ప్రారంభించిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా పహల్‌గామ్‌లో తమ దర్యాప్తును ప్రారంభించింది.
ఈ దాడి వెనుక లష్కరే తోయిబా సంస్థకు చెందిన డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఉన్నాడన్న అనుమానాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి సంభవించే ప్రమాదం ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
వివరాలు
దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరి ఫోటో విడుదల
పహల్‌గామ్‌లో జరిగిన ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలిసి బుధవారం (ఈ రోజు) జమ్మూ కశ్మీర్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ దాడిలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28కి చేరినట్లు సమాచారం.అదనంగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు నాలుగు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరి ఫోటోను పోలీసులు బయటపెట్టారు.
మంగళవారం పహల్‌గామ్‌లో పర్యాటకులపై కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకడు ఆయుధాలు ధరించి,పఠానీ డ్రెస్‌లో కనిపిస్తున్నాడు.
ఈ ఫోటోను మంగళవారం అర్ధరాత్రి 1 గంట నుండి 2 గంటల మధ్యలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలతో పంచుకున్నారు.
వివరాలు
పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి
ఈ ఉగ్రవాది రూపాన్ని గుర్తించి, అతనికి అనుగుణంగా ఉండే అనుమానితులపై నిఘా పెంచాలని, అవసరమైన దర్యాప్తు కొనసాగించాలని అధికారులు సూచించారు.
ట్రెక్కింగ్ యాత్ర కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శిస్తున్న పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అధికారులు నిర్ధారించారు.
పహల్‌గామ్‌లోని ఈ అందమైన ప్రదేశంలో పర్యటిస్తుండగా పర్యాటకులపై ఉగ్రవాదులు అనూహ్యంగా కాల్పులు జరిపారు.
ఇక,ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
వివరాలు
ఈ దాడిలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు
మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాలుపంచుకున్నారని తెలుస్తోంది. దాడికి మూడు వారాల ముందే స్థానికుల సాయంతో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం.
ఈ ఆరుగురిలో నలుగురు పాకిస్తాన్‌కు చెందినవారుగా,ఇద్దరు స్థానిక కశ్మీరీలుగా గుర్తించారు.
వీరికి TRF (The Resistance Front) అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు, వీరి వద్ద AK-47 లాంటి ఆధునిక ఆయుధాలు ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు.