తదుపరి వార్తా కథనం

Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
08:56 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాక్ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ తరుణంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
వరుసగా మూడో రోజు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని తుత్మారి గలి, రాంపూర్ సెక్టార్లలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
అయితే పాక్ ప్రేరేపించిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.