
India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.
వరుసగా నాలుగో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire) పాకిస్థాన్ ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
పూంఛ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపింది.
భారత సైన్యం (Indian Army) సమర్థవంతంగా స్పందించి, దాడిని విజయవంతంగా తిప్పికొట్టింది.
భారత సైన్యం ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 'ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి వేళ కుప్వారా, పూంఛ్ జిల్లాల నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.
భద్రతా బలగాలు వెంటనే స్పందించి శత్రు చర్యలను తిప్పికొట్టాయని పేర్కొంది.
Details
పహల్గాం ఉగ్రదాడి ప్రభావం
అధికారుల సమాచారం ప్రకారం, పూంఛ్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఘటన ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య వైరం మళ్లీ పెరిగింది.
భారత ప్రభుత్వ కఠిన నిర్ణయాలు
సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది.
పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచిపెట్టాలని ఆదేశించింది.
సిమ్లా ఒప్పందం సహా మిగతా ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
పాక్ తన గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.
Details
సరిహద్దులో కాల్పులతో కలకలం
ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో జరిగే కాల్పులు మరింత ఉద్రిక్తతకు దారితీయబోతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరిహద్దు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.