Loading...
Papia Adhikari: బాణాసంచా పేల్చితే వ్యాధులు దూరం.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
బాణాసంచా పేల్చితే వ్యాధులు దూరం.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Papia Adhikari: బాణాసంచా పేల్చితే వ్యాధులు దూరం.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పటాకులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి అన్నారు. టొల్లిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. తన నియోజకవర్గంలో నిర్వహించిన కాళీపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తుండగా అక్కడ కొన్ని బాణాసంచా పేలాయి. దీంతో పటాకులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయని ఆమె వ్యాఖ్యానించారు. కాళీపూజ సమయంలో బాణాసంచా కాల్చడం ఒక సంప్రదాయమని పాపియా అధికారి పేర్కొన్నారు. పటాకులు కాల్చుకోవచ్చని ముఖ్యమంత్రి కూడా చెప్పారని తెలిపారు. బాణాసంచా లేకుండా కాళీపూజ పూర్తికాదని, కచ్చితంగా పటాకులు కాలుస్తామని స్పష్టం చేశారు. అయితే పోలీసుల మార్గదర్శకాలకు అనుగుణంగానే బాణాసంచా పేల్చుతామని చెప్పారు.

వివరాలు 

పటాకుల వినియోగంపై కీలక సూచనలు

మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇటీవల కాళీపూజ మండపాలను ప్రారంభించిన సందర్భంగా పటాకుల వినియోగంపై కీలక సూచనలు చేశారు.

పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ క్రాకర్స్, పర్యావరణహిత బాణాసంచా మాత్రమే కాల్చాలని కోరారు.

భారీ శబ్దాలు వచ్చే పటాకులకు దూరంగా ఉండాలని సూచించారు. శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ADVERTISEMENT