Page Loader
Parliament Winter Session: అదానీ అవినీతి అంశం.. రాజ్యసభ సోమవారానికి వాయిదా
అదానీ అవినీతి అంశం.. రాజ్యసభ సోమవారానికి వాయిదా

Parliament Winter Session: అదానీ అవినీతి అంశం.. రాజ్యసభ సోమవారానికి వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పారిశ్రామికవేత్త అదానీపై అవినీతి ఆరోపణలు, యూపీలోని సంభల్ జిల్లాలో జరిగిన హింసాత్మక సంఘటనలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ అంశాలపై విపక్షాలు తీవ్ర నిరసనలు చేపట్టాయి, సభలో నినాదాలు చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడాయి. గత మూడు రోజుల నుంచి లోక్‌సభ,రాజ్యసభల్లో వాయిదాల సిరీస్ కొనసాగుతోంది. నాలుగో రోజు అయిన శుక్రవారం కూడా ఈ పరిస్థితి కొనసాగింది. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

వివరాలు 

డిసెంబర్ 2వ తేదీకి వాయిదా 

ఉదయం 11 గంటలకు సభలు ప్రారంభమైన సమయంలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తూ, సభను డిసెంబర్ 2వ తేదీ (సోమవారానికి)కి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. అదనంగా, లోక్‌సభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది, అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాల దృష్టి పెట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేశారు.