Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 'కిరణ్ రిజిజు' ప్రకటించారు. సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలు నిర్మలంగా, సజావుగా నడుస్తాయని ఆశిస్తున్నామని, ఇందుకు విపక్షాలు కూడా సహకరించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనలు, ఆందోళనలతోనే గడిచిన విషయం తెలిసిందే.
Details
ప్రత్యేక ఓటర్ సర్వేపై నిరసనలు
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ సర్వేపై విపక్షాలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశాయి. సమావేశాలన్నీ అదే అంశంపై వాగ్వాదాలు, వాకౌట్లు, ఆందోళనలతో నిండిపోయాయి. గందరగోళం మధ్యే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శీతాకాల సమావేశాలు కీలక బిల్లులు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చలకు వేదిక కానున్నాయి.