LOADING...
Indigo Flight-Delay: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం

Indigo Flight-Delay: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం

వ్రాసిన వారు Stalin
Apr 15, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో(Indigo) విమానం ప్రయాణికులకు చుక్కులు చూపించింది. అయోధ్య (Ayodhya) నుంచి ఢిల్లీ (Delhi) కి బయల్దేరిన ఇండిగో విమానం మధ్యలో ఇంధనం అయిపోయిపోవడంతో చండీగర్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అయితే ఇండిగో విమానయాన సంస్థపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంస్థ సరైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిడ్యూర్స్ను ఉల్లంఘిస్తుందని విమర్శించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సతీష్ కుమార్ 'భయంకరమైన అనుభవం' అంటూ సోషల్ మీడియాలో షేర్ పోస్టులో ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 13 న అయోధ్యలో 3.25 గంటలకు బయల్దేరి ఢిల్లీకి 4.30 గంటలకు ఇండిగో విమానం చేరుకోవాలి.

Flight delay

ప్రతికూల వాతావరణం ఉందని చెప్పిన పైలట్

అయితే ల్యాండింగ్ కు ముందు ప్రతికూల వాతావరణం ఉందని పైలట్ ప్రకటించి రెండు సార్లు ఢిల్లీలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక విమానంలో కేవలం 45 నిమిషాలకు మాత్రమే సరిపడా ఇంధనమే ఉండగా...అక్కడే రెండుసార్లు విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి సమయాన్ని ఇంధనాన్ని వృథా చేసేశారని సతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా పైలట్ 75 నిమిషాలు వృథా చేసి ఇంధనం లేదని విమానాన్ని చండీగర్​ లో ల్యాండింగ్ చేశారని ఆ పోస్టులో వివరించారు.