Page Loader
Hyderabad: వణికిస్తున్నచలి'పులి'.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
వణికిస్తున్నచలి'పులి'.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

Hyderabad: వణికిస్తున్నచలి'పులి'.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2023
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

చలి ప్రజలను వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా చలి తీవ్రత పెరుగతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం చలి మరింత పెరిగింది. పటాన్ చెరులో 12.4, దుండిగల్ లో 18 డిగ్రీల కనిష్థ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉదయం 7 గంటల వరకు పొగమంచు రహదారులు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Details

ఇంట్లో బయటకొచ్చేందుకు భయపడుతున్న ప్రజలు

ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత తగ్గక పోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో రెండు రోజులు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు తూర్పు దిశగా వీస్తారని వెల్లడించారు.