Pawan Kalyan and Anna Lezhneva: 13 ఏళ్ల వైవాహిక బంధానికి పవన్ కల్యాణ్, అన్నా లెజ్‌నెవా స్వస్తి
ఈ వార్తాకథనం ఏంటి
13 ఏళ్ల వైవాహిక బంధానికి పవన్ కళ్యాణ్, అన్నా లెజ్‌నెవా ముగింపు పలికారు. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాత్రి జనసేన పార్టీ అధికారిక మీడియా గ్రూప్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గోప్యతను గౌరవించాలని మీడియా, ప్రజలను కోరారు.
వివరాలు
2011లో పరిచయం.. 2013లో వివాహం
రష్యాకు చెందిన అన్నా లెజ్‌నెవాతో పవన్ కల్యాణ్‌కు 2011లో పరిచయం ఏర్పడింది.
'తీన్ మార్' సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు.
ఆ పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వీరి వివాహం జరిగింది.
ఈ దంపతులకు కుమార్తె పొలెనా అంజనా పవనోవా,కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు.
పవన్‌కు ఇది మూడో వివాహం
పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం. ఆయన తొలుత 1997లో నందినిని పెళ్లి చేసుకున్నారు. అయితే 2008లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. వీరి బంధం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు.
వివరాలు
జనసేన వర్గాల ధ్రువీకరణ
2012లో ఇద్దరూ విడిపోయారు. రేణు దేశాయ్‌తో పవన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పవన్ కల్యాణ్, అన్నా లెజ్‌నెవా సంయుక్త ప్రకటన వెలువడిన వెంటనే జనసేన పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
అయితే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి.
గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా తెలుస్తోంది.