Janasena: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ (జెఎస్‌పి) శాసనసభ్యులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత,పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఓటు వేశారు.ఈ దృశ్యాన్నిటీవీలు,ఫోన్‌లలో చూసిన లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు,జనసేన కేడర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం కోసం దాదాపు పదేళ్లుగా వారు నిరీక్షిస్తున్నారు.ఎట్టకేలకు వారి ఆశలు ఫలించి పవన్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా శాసించే స్థాయికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా PawanKalyan ఎన్నిక
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ @PawanKalyan గారు ఎన్నిక ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రతిపాదించారు.... pic.twitter.com/kZABNr19PP— JanaSena Party (@JanaSenaParty) June 11, 2024