LOADING...
Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్
పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్

Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

శేషాచల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ జనసేన పార్టీ "బిగ్ ఎక్స్‌పోజ్" పేరుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్వయంగా భారీ విషయాలను వెలుగులోకి తెచ్చారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై పవన్‌ కల్యాణ్‌ తీసిన ఏరియల్‌ వీడియోలు, మ్యాపింగ్‌ డేటాతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈస్ట్‌ ఘాట్స్‌లోని రక్షిత అటవీ ప్రాంతాల్లో సుమారు 76.74 ఎకరాల భూకబ్జా జరిగినట్టు వెల్లడించారు. ఈ అక్రమ భూముల ఆక్రమణలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక

రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించబడినట్టు కూడా పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. తాజా తిరుపతి పర్యటనలో ఆయన స్వయంగా సైట్‌ను సందర్శించి పరిశీలించారు. ఈ ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించారు. ఇకపై ప్రతి ఆక్రమణదారుడి వివరాలు.. వారి పేర్లు, ఆక్రమించిన భూభాగం విస్తీర్ణం, కేసుల స్థితి వంటి వివరాలను అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్‌ల్యాండ్‌ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఈ దర్యాప్తును విజిలెన్స్‌, లీగల్‌ టీమ్‌లతో సమగ్రంగా జరపాలని ఆదేశించారు.

వివరాలు 

భూసమాచారాన్ని డిజిటలైజ్‌ చేయాలని, రికార్డులను పారదర్శకంగా ఉంచాలని సూచన 

అంతేకాకుండా, భూసమాచారాన్ని డిజిటలైజ్‌ చేయాలని, రికార్డులను పారదర్శకంగా ఉంచాలని సూచించారు. "అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిపై ఎవరి హక్కు లేదు. వాటిని ఆక్రమించేవారిని అస్సలు విడిచిపెట్టం" అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. అటవీ,వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిప్యూటీ సీఎంవో చేసిన ట్వీట్