Page Loader
పవన్‌కళ్యాణ్‌కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్
పవన్‌కళ్యాణ్‌కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్

పవన్‌కళ్యాణ్‌కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2023
08:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఆయన డబ్బు మనిషి కాదని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. తర్వాత 'బ్రో' సినిమా శ్యాంబాబు విదాదంపైనా ఆమె మాట్లాడారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగానే తాను సపోర్టు చేస్తున్నాననే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు.

Details

తమ పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ ఓ సక్సెస్ ఫుల్ నటుడని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతోనే ఫ్యామిలీ పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, దయచేసి ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని కొంతమంది చెబుతున్నారని, పరిస్థితులు ఏమైన సరే తన పిల్లలను అందులోకి లాగొద్దని, రాజకీయంగా ఏదైనా ఉంటే మీరే చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించారు. సమాజంలో ఒక వ్యక్తిగా తాను మాట్లాడుతున్నానని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకూడదని రేణూ దేశాయ్ మనవి చేశారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో