PM Modi: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : నరేంద్ర మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 19, 2026
10:43 am
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఫోన్‌లో మాట్లాడి ఆయన యోగక్షేమాలను తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొద్దినెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేపట్టారు. ప్రస్తుతం ఆయన చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు సమాచారం.