Page Loader
Pawankalyan: ఎన్నికల ఫలితాలపై జనసేనాని కామెంట్స్.. "నాకు రాజకీయాల్లో తొలిగెలుపు అని స్పష్టం"
ఎన్నికల ఫలితాలపై జనసేనాని కామెంట్స్.. "నాకు రాజకీయాల్లో తొలిగెలుపు అని స్పష్టం"

Pawankalyan: ఎన్నికల ఫలితాలపై జనసేనాని కామెంట్స్.. "నాకు రాజకీయాల్లో తొలిగెలుపు అని స్పష్టం"

వ్రాసిన వారు Stalin
Jun 04, 2024
07:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చిరస్మరణీయమైన గెలుపును అందించిన పిఠాపురం ప్రజలకు, జనసైనికులకు తెలుగుదేశం శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏరు దాటాక తెప్ప తగలేసే వ్యక్తిని కాదని అలాంటి వైఖరి నాది కాదన్నారు . ఉద్యోగుల సీపీఎస్ విషయంలో ఎడాదిలోగా అనుకూల నిర్ణయం తీసుకుంటామని యువత భవితవ్యం కోసం మెగా డీఎస్సీ ని ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 5 కోట్ల మంది ప్రజల నూతన భవితవ్యానికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి అడుగు వేస్తామని కక్ష్య సాధింపులు చేయమన్నారు.

details 

పవన్ మీడియా సమావేశం 

నాకు రాజకీయాల్లో లభించిన తొలి గెలుపు ఇదేనని ,దేశ రాజకీయాల్లోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో నూటికి నూరు శాతం గెలవటం ఓ అరుదైన రికార్డ్ ఇది జనసైనికుల వల్లే సాధ్యపడిందన్నారు. అదేవిధంగా ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ,. జవాబుదారీతనంతో పని చేస్తామని చెప్పారు. మాటలతో కాకుండా, చేతలతో ప్రజలకు మేలు చేస్తామన్నారు. ...