Pawan Kalyan: నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్.. ఇప్పటంలో పవన్ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. వైకాపా హయాంలో రోడ్డు విస్తరణ నామమాత్రంగా ఇప్పటంలోని జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేశారని ఆరోపణలు ఉన్నాయి. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనా సమయంలో పవన్ కల్యాణ్ గ్రామంలో పర్యటించి, బాధితులకు ధైర్యం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని, ఇంటి వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఆయనను ప్రత్యేకంగా అభ్యర్థించగా, ఆయన ఆమెకు ఇచ్చిన మాటను మరువలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇప్పటానికి వెళ్లి నాగేశ్వరమ్మ ఇంటిని సందర్శించారు. Embed
వివరాలు
వృద్ధురాలకు రూ.50,000,ఆమె మనవడి విద్యకు..
వృద్ధురాలు ఆయనను హృదయపూర్వకంగా స్వాగతించగా, పవన్ ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసి ఆరోగ్యం, యోగక్షేమాల పట్ల విచారించారు. వృద్ధురాలకు రూ.50,000, అలాగే ఆమె మనవడి విద్యకు రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, నాగేశ్వరమ్మ మనవడి చదువుకు ప్రతి నెలా తన వేతనంలో నుంచి రూ.5,000 ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తన మాట మేరకు ఇంటికి వచ్చి సంతోషం కలిగించారని పేర్కొన్నారు. పెద్ద కుమారుడిలా కుటుంబ యోగక్షేమాలను తెలుసుకోవడం ఆనందంగా ఉందని, ఆయన కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారని, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇప్పటంలో పవన్ పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్లి మాట్లాడారు. pic.twitter.com/iZCrIRdoAF
— JanaSena Party (@JanaSenaParty) December 24, 2025