తదుపరి వార్తా కథనం

Pawan Kalyan: తిరుమల శ్రీవారిని దర్శించిన పవన్ కళ్యాణ్.. ప్రాయశ్చిత దీక్ష విరమణ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 02, 2024
11:26 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి కూడా ఈ పవిత్ర సేవలో పాల్గొన్నారు.
గొల్ల మండపంలో పవన్‌కు పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు పవన్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల లడ్డూ కల్తీ కారణంగా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
Details
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్
11 రోజుల దీక్ష అనంతరం పవన్ మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
అనంతరం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి, తన దీక్షను విరమించారు.
ఇక తిరుమల ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారి ఆశీర్వచనం తీసుకున్నారు.