
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. తెనాలి సభ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన పార్టీ అధ్యక్షుడు,నటుడు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు లోనయ్యారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో గత కొద్దిరోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అటు రాజకీయాల్లోనూ ఇటు షూటింగ్లోనూ పాల్గొంటూ తీరికలేకుండా సమయాన్ని గడుపుతున్నారు పవన్ కళ్యాణ్.
దీంతో తీవ్ర అలసటకు గురైన ఆయన తాజాగా అస్వస్థతకు లోనయ్యారు.
కాగా పిఠాపురంలో తీరికలేకుండా నియోజకవర్గ ప్రజలను కలుస్తూ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇలా వరుస పర్యటనల నేపథ్యం..మండుతున్న ఎండల కారణంగా ఆయనకు జ్వరం వచ్చిన ట్లు వైద్యులు చెప్పారు.
Details
తెనాలిలో వారాహి యాత్ర వాయిదా
వారి సూచన మేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా....జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి లో వారాహి సభను నిర్ణయించారు.
ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉండగా...అనారోగ్యకారణాలతో పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు.
అనంతరం అస్వస్థతకు లోనైన కారణంగా తెనాలిలో నిర్వహించాల్సిన వారాహి యాత్ర, సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ పోస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్టీ చేసిన ట్వీట్
#VarahiVijayaBheri :
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2024
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు…