Loading...
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్
కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హత్య బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను కూడా చంపేస్తామంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పంజాబ్‌లోని మొహాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపుల విషయం ఢిల్లీలోని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశం పంపినట్లు ఆయన పోలీసులకు తెలిపారు.

వివరాలు 

మొహాలీ ఎస్ఎస్పీ కు ఫిర్యాదు

ఈ మేరకు నవంబర్ 6న మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)కు ఫిర్యాదు చేశారు.

ఫోన్ చేసిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని పరిచయం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు రూ.7 కోట్లు చెల్లించాలని, లేదంటే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను హత్య చేస్తామని ఆ వ్యక్తి బెదిరించినట్లు జర్నైల్ సింగ్ వెల్లడించారు.

ఫోన్ కాల్‌లో చెప్పిన విషయాలనే వాట్సాప్ సందేశంలోనూ పంపినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా పోలీసులకు సమర్పించారు.

వివరాలు 

ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు..

ఎమ్మెల్యే ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన మొహాలీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించాలని జర్నైల్ సింగ్ పోలీసులను కోరారు.

ఇందుకోసం కాల్ డీటెయిల్ రికార్డులు (సీడీఆర్), ఐపీ లాగ్స్, ఫోన్ లొకేషన్ వివరాలను పరిశీలించాలని సూచించారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT