తదుపరి వార్తా కథనం
Telangana: తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2025
03:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పీఈ సెట్,ఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేయనున్నారు.దరఖాస్తుల స్వీకరణ మార్చి 15 నుండి మే 24 వరకు జరగనుంది.
అపరాధ రుసుముతో మే 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను అందుకోవాలని ఉన్నత విద్యా మండలి తెలిపింది.
తెలంగాణలో పీఈ సెట్ పరీక్షలు జూన్ 11 నుండి 14 మధ్య నిర్వహించబడతాయి.
ఎడ్ సెట్ షెడ్యూల్:
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ వర్సిటీ విడుదల చేసింది.ఈనోటిఫికేషన్ మార్చి 10న జారీ చేయనున్నారు.
మార్చి 12 నుండి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పరీక్షలు జూన్ 1న ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించబడతాయి.