Loading...
Cheyutha Pensions: తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు.. నేటి నుంచే అమలు
తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు.. నేటి నుంచే అమలు

Cheyutha Pensions: తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు.. నేటి నుంచే అమలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని నిరుపేద, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం దీపావళి వేళ సామాజిక భరోసా కల్పించే నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన మరో 4.5 లక్షల మంది అర్హులకు 'చేయూత' పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పండుగ వేళ లక్షలాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు

కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 8న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

ఎంపికైన లబ్ధిదారులందరికీ నవంబర్ నెల నుంచే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ కానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు

వితంతువులు, దివ్యాంగులు, కార్మికులకు ఆర్థిక ఆసరా

కోడంగల్‌లో కార్యక్రమం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నిర్ణయంతో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా లభించనుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం ఉద్ఘాటించింది.

ADVERTISEMENT